epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏజెన్సీ చట్టాలకు తూట్లు!

ఏజెన్సీ చట్టాలకు తూట్లు!
అనుమతి లేకున్నా బహుళ అంతస్తులు!
పంచాయతీ నోటీసులు బుట్టదాఖలు
‘మేము మొనార్కులం’ అంటూ ప్రబుద్ధుల సవాల్!
శ్రీనగర్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు
రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు?
1/70 చట్టం అమలులో ఉన్నా బేఖాతరు..

కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని శ్రీనగర్ గ్రామపంచాయతీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఏజెన్సీ చట్టాలను, పంచాయతీరాజ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి లేని ఈ ‘పేక మేడల’పై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1/70 చట్టం ప్రకారం.. ఇక్కడ ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే సంబంధిత పంచాయతీ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ, శ్రీనగర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనుమతులు లేకున్నా ఒకటి నుంచి మూడంతస్తుల వరకు భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. అధికారులు ధైర్యం చేసి ప్రశ్నిస్తే, “మేము అంతే కడతాం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు” అంటూ నిర్మాణదారులు బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినా, వాటిని కనీసం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తుండటం గమనార్హం.

ద్వంద్వ వైఖరిపై ప్రజల ఆగ్రహం
అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటే నిబంధనలు గుర్తుచేసే అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా బాబులు బహుళ అంతస్తులు కడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మండల స్థాయి అధికారులు, తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం వెనుక భారీగా చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన చర్యలు తప్పవు: పంచాయతీ కార్యదర్శి వంశీ
శ్రీనగర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శి వంశీ ‘కాకతీయ’తో మాట్లాడారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా చేపడుతున్న భవనాలపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. పలువురికి నోటీసులు జారీ చేశామని, నిబంధనలను ధిక్కరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆగడం లేదు. మరి ఈ అక్రమ నిర్మాణాల ‘పేక మేడలు’ ఎప్పుడు కూలుతాయో, చట్టం తన పని తాను ఎప్పుడు చేస్తుందో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.