epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దేశ విభజన వాదులకు గుణపాఠం

దేశ విభజన వాదులకు గుణపాఠం
దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్‌
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో గుణ‌పాఠం
కార్యకర్తల పోరాటాలు త్యాగాలతోనే బెంగాల్‌లో బీజేపీకి అధికారం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్ లో పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

భద్రతా వైఫల్యం స్పష్టం
కరీంనగర్ జువెలరీ షాపు ఘటనలో గాయపడ్డ బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని బండి సంజయ్ పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్ కు, మధుకర్ కు బుల్లెట్ గాయాలయ్యాయని, చికిత్స అందుతోందని వివరించారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయమనడం పెద్ద జోక్ అని కొట్టిపారేశారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమనే సోయి కూడా లేని వాళ్లను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చొరబాటుదారులకు ఓటు హక్కు ఎందుకు?
బెంగాల్ ప్రజలు టీఎంసీ చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చారని బండి సంజయ్ అన్నారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే తప్పేముందని ప్రశ్నించారు. దేశాన్ని అస్థిరపర్చే వారికి ఓటు హక్కు ఎందుకివ్వాలని నిలదీశారు. ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.