epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దమ్ముంటే రైతు ఉత్సవాలు నిర్వహించాలి

దమ్ముంటే రైతు ఉత్సవాలు నిర్వహించాలి
వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం మొక్కజొన్న రైతుల అవస్థలు
కొనుగోలు చేసిన సరుకును తరలించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
బార్ దాన్లు తంబుల పేరుతో అన్నదాతల నుంచి అక్రమ వసూళ్లు
వరంగల్ డిక్లరేషన్ హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాకతీయ, వరంగల్ : దమ్ముంటే రైతు ఉత్సవాలను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బార్ దాన్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతులు పండించిన సరుకును కొనుగోలు చేసినప్పటికీ, వాటిని తరలించడానికి వాహనాలు సమకూర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక్కో రైతు 25 రోజులుగా కాంటాల కోసం ఎదురుచూడడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బార్ దాన్లను అమ్ముకుంటూ, తంబుల పేరుతో రైతుల నుంచి 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతుబీమా అమలు చేయకుండా అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముట్టడిస్తామని హెచ్చరిక
ఈ నెల 6వ తేదీ నాటికి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి మూడేళ్లు పూర్తవుతోందని, ఆ హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అకాల వర్షాలతో పంట నష్టపోతే ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ నెల 6వ తేదీలోపు ఏనుమాముల మార్కెట్ లోని మక్కలను కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఉత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.