ఇంద్రకీలాద్రిపై వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నా
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
కాకతీయ, కారేపల్లి : విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న ఎమ్మెల్యే.. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతన్నల పాడిపంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నాను. నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, ఉపేందర్, జయరాజ్, రాజేష్, వినోద్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

