epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొనుగోలు కేంద్రంలో  రైతు  వెంక‌టేశ్వ‌ర్లు మృతి

కొనుగోలు కేంద్రంలో  రైతు  వెంక‌టేశ్వ‌ర్లు మృతి
అలంకానిపేట ఘ‌ట‌న ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నం
వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఎండల్లో ఎదురుచూపులతో మానసికంగా కుంగిపోతున్న అన్నదాతలు
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి రైతులను పడిగాపులు పెట్టడం వల్లే నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మరణించిన రైతు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రస్తుత కఠినమైన ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు, గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నరకం చూస్తున్నారన్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కల్లాల వద్దే ధాన్యానికి కాపలా కాస్తూ రైతులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో వడ్ల కాంటా కోసం తిరుగుతూ అలసిపోయిన వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శించారు.
అవినీతి వల్లే కొనుగోళ్లలో ఆలస్యం
కాపులకనపర్తి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు, అలంకానిపేట కేంద్రంలో వడ్లు విక్రయించేందుకు నెలరోజులుగా తిరుగుతున్నా కొనుగోళ్లు జరగకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు, రైతులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యం, అవినీతి కారణంగానే ఈ ప్రక్రియ పూర్తిగా ఆలస్యమవుతోందని ఆరోపించారు. ఒకపక్క అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల వద్ద ఉన్న ప్రతీ గింజనూ వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.