epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చంపేసినా..పోస్టుమార్టం నివేదిక‌లివ్వ‌రా..?

సామాన్యుల ప్రాణాల‌కు విలువేది..?
చంపేసినా..పోస్టుమార్టం నివేదిక‌లివ్వ‌రా..?
అనుమానాస్ప‌ద మృతుల కేసుల్లో డీఎంహెచ్‌వో విచార‌ణేది..?
వైద్యం పేరిట ప్రైవేటు ఆస్ప‌త్రుల ఫ‌క్తు వ్యాపారం
కరీంనగర్‌లో బ‌య‌ట ప‌డుతున్న‌ కార్పొరేట్ ఆసుపత్రుల బాగోతం
రోగి చనిపోయినా గుట్టుగా చికిత్స.. ‘వన్’ హాస్పిటల్‌పై ‘ఠాగూర్’ తరహా ఆరోపణలు
అదే ఆసుపత్రిలో మంత్రి అడ్లూరికి ‘లిఫ్ట్’ ప్రమాదం..
మరునాడే త‌నిఖీల పేరుతో ఆరోగ్య‌శాఖ అధికారుల హ‌డావుడి
యశోద కృష్ణ ఆసుపత్రిలోనూ మహిళ మృతి చెందితే క‌నీసం క‌న్నెతి చూడ‌ని డీఎంహెచ్‌వో

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : ప్రాణం పోయాల్సిన వైద్య రంగం.. కరీంనగర్ జిల్లాలో కాసులు కురిపించే వ్యాపారంగా మారిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య నిర్లక్ష్యం, అడ్డగోలు బిల్లులు, భద్రతా లోపాలు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపగా.. తాజాగా నగరంలో చోటుచేసుకున్న వరుస ఘటనలు ప్రైవేట్ వైద్యు ల అసలు రూపాన్ని బట్టబయలు చేశాయి. సామాన్య రోగుల మరణాలను దాచిపెట్టి డబ్బులు గుంజే అరాచకాలు ఒకవైపు.. కనీస భద్రత లేక సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఆసుపత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ప్రమాదాలు మరోవైపు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో కరీంనగర్‌లోని ‘వన్ హాస్పిటల్’ లో చోటుచేసుకున్న ఘోరం ‘ఠాగూర్’ సినిమా దృశ్యాలను తలపించింది. వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన సాహెబ్ బీ (60) అనే మహిళ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె మృతి చెందినప్పటికీ.. కుటుంబ సభ్యులకు ఆ నిజం చెప్పకుండా ఐసీయూలో ఉంచి చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేశారని ఎంఐఎం నాయకులు, బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆసుపత్రి ఎదుట రోగుల బంధువులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సదరు ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అదే ఆసుపత్రిలో మంత్రికి ‘లిఫ్ట్’ గండం!

రోగి మృతి వ్యవహారంలో వివాదాల్లో ఉన్న అదే ‘వన్ హాస్పిటల్’ లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురికావడం ఆసుపత్రుల భద్రతా లోపాలకు అద్దం పడుతోంది. ఆసుపత్రిలో ఉన్న ఒక రోగిని పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. మంత్రి ఎక్కిన లిఫ్ట్.. సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. మంత్రి కొద్దిసేపు అందులోనే చిక్కుకుపోగా, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పర్యవేక్షణ, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్ ఫిట్‌నెస్ లేని ఇలాంటి ఆసుపత్రుల్లో సామాన్యుల ప్రాణాలకు గ్యారెంటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

సామాన్యుడి ప్రాణం చౌకనా? వీఐపీల‌కేనా రక్షణ?

మంత్రికి ప్రమాదం జరగ్గానే కదిలిన అధికార యంత్రాంగం మ‌రునాడే ఆస్ప‌త్రుల్లో సేఫ్టీపై నానా హ‌డావుడి చేసింది. అంతకుముందు సామాన్య మహిళ వైద్య నిర్లక్ష్యంతో చనిపోతే ఎందుకు స్పందించలేదన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. వైద్యుల నిర్ల‌క్ష్యంతో, శ‌స్త్ర చికిత్స‌లు విక‌టించి రోగులు మృతి చెందుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన కేసుల్లో పోస్టు మార్టం నిర్వ‌హించ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. డీఎంహెచ్ స్థాయి అధికారి స్థాయి ఆస్ప‌త్రిని విజిట్ చేయ‌డంతో పాటు రిపోర్ట్ చేయాల్సి ఉండ‌గా..ఇవేవీ జ‌ర‌గ‌డం లేదు. సామాన్యుల ప్రాణాల‌కు విలువ లేద‌న్న‌ట్లుగా ఆరోగ్య‌శాఖ వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
ఇటీవల నగరంలోని ‘యశోద కృష్ణ ఆసుపత్రి’లోనూ ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి చెందింది. బాధితులు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరిగారు. రోగి ప్రాణాల‌కు వెల క‌ట్టి ఎంతోకొంత ముట్ట‌జెప్పి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం.. అన్యాయం చేసి చేతులు క‌డిగేసుకుంది.

క‌రీంన‌గ‌ర్‌లో క‌మీష‌న్ రాకెట్‌
గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఒక పెద్ద ‘కమిషన్ రాకెట్’ నడుపుతున్నాయి. గ్రామాల్లోని కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే రోగులను భయపెట్టి నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయిస్తున్నారు. ఇలా పంపినందుకు సదరు ఆర్ఎంపీలకు భారీగా కమిషన్లు ముడుతున్నట్లు స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రస్తావించడం గమనార్హం. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై, అర్హత లేని సిబ్బంది నిర్వహణపై తక్షణమే ఉన్నతాధికారుల బృందంతో సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.