ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరులో ప్రతిభ
హరికృష్ణ రెడ్డికి ప్రశంసా పత్రం
విద్యా విజయోత్సవంలో 90 శాతం పైగా నమోదుకు గుర్తింపు
కాకతీయ, ఇల్లంతకుంట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా విజయోత్సవ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరులో 90 శాతం పైగా నమోదు చేసినందుకు గాను హరికృష్ణ రెడ్డి కి ఘనమైన గుర్తింపు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వేదికగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హాజరు శాతాన్ని పకడ్బందీగా పెంచడంలో హరికృష్ణ రెడ్డి చూపిన చొరవను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఇటువంటి కృషి ఎంతో అవసరమన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న హరికృష్ణ రెడ్డి ని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇల్లంతకుంట మండల ఉపాధ్యాయులు మరియు తోటి సిబ్బంది ఘనంగా అభినందించారు.

