epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి కుటుంబానికి ఉచిత జీవిత బీమా

ప్రతి కుటుంబానికి ఉచిత జీవిత బీమా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం!
అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి
వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
వరంగల్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని పిలుపు
ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సదస్సు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా వరంగల్ హంటర్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌లో శుక్రవారం భారీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ సదస్సులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ప్లాస్టిక్ నిషేధం – మన వరంగల్ పరిరక్షణ’ ప్రత్యేక సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్, ఎమ్మెల్సీలు ఫొటోలు దిగి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఉచిత జీవిత బీమా’
సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా (ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి) జీవిత బీమా కల్పించే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే “అల్పాహారం పథకం” తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రజాపాలన సాగుతోందని కొనియాడారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. వరంగల్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం అభినందనీయమన్నారు.

జూన్ 12 వరకు మరింత సమర్థవంతంగా పనిచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 కీలక అంశాలపై గ్రామీణ, మండల స్థాయిల్లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. జూన్ 12 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలని ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ, వర్ధన్నపేట మున్సిపల్ చైర్‌పర్సన్ సారంగపాణి, అదనపు కలెక్టర్లు జి. సంధ్యారాణి, గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం మరియు వివిధ మండలాల తహశీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.