ఎల్లమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన
కందికట్కూర్‌లో 27, 28 తేదీల్లో మహా జాతర
భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు
: రూరల్ సీఐ నాగేశ్వర్ రావు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు
కాకతీయ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న కందివారి ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మ మహా జాతర ఏర్పాట్లను సోమవారం సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్ రావు పరిశీలించారు. స్థానిక ఎస్ఐ అశోక్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. జాతర నిర్వహణ, బందోబస్తుపై ఆలయ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. జాతరలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జాతర సమయంలో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. భక్తులు పోలీసులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ నిర్వాహకులు కంది రాజిరెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, కంది లింగారెడ్డి, గుర్రం వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

