epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పల్లెలకు కేంద్రం నిధులు

పల్లెలకు కేంద్రం నిధులు
9వేల కోట్లతో పంచాయతీలకు మహర్దశ
పదహారో ఆర్థిక సంఘం నిధుల‌తో పంచాయ‌తీల‌కు ఊరట
5ఏళ్ల కాలం నాటికి 9968 కోట్ల నిధులు మంజూరు
పాలకవర్గాలు లేక స్తంభించిన పల్లె ప్రగతి
కేంద్రం తాజా నిధులతో మారనున్న రూపురేఖలు
మౌలిక వసతులకే ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలు

కాక‌తీయ‌, కొత్త‌గూడెం : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం పల్లెలకు భారీ నజరానా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర 16వ ఆర్థిక సంఘం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. కొంతకాలంగా పాలక వర్గాలు లేకపోవడం, రాష్ట్ర నిధుల విడుదల నిలిచిపోవడంతో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కనీస సేవ‌ల‌ను కూడా అందించలేక పంచాయతీలు చేతులెత్తేసిన దుస్థితి నెలకొంది. ఈ దీనస్థితిని గమనించిన కేంద్రం, 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణకు ఏకంగా రూ. 9,968 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

నిధుల మళ్లింపునకు బ్రేక్
గతంలో కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా ఇతర పథకాలకు దారిమళ్లించాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్రం ఈసారి అత్యంత స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామపంచాయతీల మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా సేవలకే ఖచ్చితంగా వినియోగించాలని స్పష్టం చేసింది. అంతేకానీ, స్థానిక సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టకూడదని ఢిల్లీ పెద్దలు హుకుం జారీ చేశారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్‌లలో ఏ చిన్న అవకతవకలు తేలినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

జనాభా, వైశాల్యం లెక్కలతోనే నిధులు

దేశవ్యాప్తంగా 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి రూ. 4,35,236 కోట్ల గ్రాంట్లను ప్రకటించగా, అందులో 80 శాతం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. ప్రతి ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. 2026 నాటి అంచనాల ప్రకారం.. గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం వెయిటేజీ ఇవ్వగా, తెలంగాణకు గ్రామీణ జనాభా ఆధారంగా 1.92 శాతం, వైశాల్యం ఆధారంగా 0.37 శాతం వాటా లభించింది. ఈ సమీకరణాల వల్లే రాష్ట్రానికి రూ. 9,968 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుంటేనే రాబోయే రోజుల్లో తెలంగాణ పల్లెలకు నిజమైన మహర్దశ పడుతుందని, లేదంటే నిధులు ఉండి కూడా వాడుకోలేని అసమర్థత పాలకవర్గాలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.