epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెండు రోజుల్లో ధాన్యం కొనాలి

రెండు రోజుల్లో ధాన్యం కొనాలి
లేదంటే అధికారుల ఇళ్ల ముందు పోస్తాం
ప్రభుత్వ అలసత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం
నగునూరు, చేగుర్తి కొనుగోలు కేంద్రాల పరిశీలన
అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి గోదాం కేటాయింపు

కాకతీయ, కరీంనగర్ : వరి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రెండు రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గంలోని రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే.. జిల్లా అధికారుల ఇళ్ల ఎదుట ధాన్యం పోసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, చేగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నెలన్నరగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పాటు, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆవేదనపై స్పందించిన గంగుల.. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఏఎంసీలోని గోదాం నంబర్-7ను ధాన్యం నిల్వకు కేటాయించాలని కోరారు. సివిల్ సప్లై అధికారులను కొనుగోలు కేంద్రానికి పిలిపించి సమస్యలపై నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హమాలీలు, రవాణా వాహనాల కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని ట్రాక్టర్లను రవాణాకు వినియోగించేలా, హమాలీలను సమీకరించి ధాన్యం తరలించేలా దగ్గరుండి చర్యలు చేపట్టారు. అనంతరం చేగుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం కుప్పలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెబుతూ, దగ్గరుండి ధాన్యానికి కాంటా వేయించి రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మే 5లోపు కొనుగోళ్లు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవాళ్లమని, కానీ కాంగ్రెస్ పాలనలో మే చివరికి వచ్చినా సగం ధాన్యం కూడా కొనలేకపోయారని విమర్శించారు. కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, అధికారులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రెండు రోజుల్లో తడిసిన, తడవని ప్రతి గింజను కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, తోట తిరుపతి, డైరెక్టర్లు లక్ష్మయ్య, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.