పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
ప్రారంభించిన సర్పంచ్ వీరన్న నాయక్
కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని దుర్గా భవాని తండ గ్రామపంచాయతీ పరిధిలోని పినాయతండా లో పసుపు డబుల్ డ్రమ్ పాలిషర్ యూనిట్‌ను గ్రామ సర్పంచ్ భూక్యా వీరన్న నాయక్ శనివారం ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు స్పైసెస్ బోర్డు. క్యూ జి బి జి పథకం కింద 75 శాతం సబ్సిడీ లభించగా, మొత్తం వ్యయం ₹1.57 లక్షలు. యూనిట్ ఏర్పాటుకు ఎస్ ఇ ఆర్ పి మరియు ఐ సి ఆర్ ఐ ఎస్ ఎ టి సంస్థలు సాంకేతిక సహకారం అందించాయి.పసుపు ప్రాసెసింగ్ నాణ్యతను మెరుగుపరచడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, అలాగే స్థానిక రైతులు మరియు ఉత్పత్తిదారుల సమూహ సభ్యులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం డిఆర్డిఏ ఏపీఎ బాబు, నెల్లికుదురు ఏపీఎం నరేంద్ర కుమార్, సంస్థ జిల్లా సమన్వయకర్త డి ఎల్ సి లాలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు సీసీలు, ఎఫ్.పి.సి, సీఈవో లు బానోతు రమేష్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎఫ్ వి సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు మరియు ఇతర ప్రాజెక్టు సిబ్బంది పాల్గొని వారు మాట్లాడుతూ విలువ ఆధారిత వ్యవసాయ మౌలిక సదుపాయాలు రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే కాకుండా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించి ఆదాయ వృద్ధికి తోడ్పడతాయని తెలిపారు.ఈ నూతన యూనిట్ ద్వారా ప్రాంతంలో పండించే పసుపు నాణ్యత మరింత మెరుగుపడి, మార్కెట్లో అధిక విలువ లభించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

