epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మాయాజాలం!

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మాయాజాలం!
గడువు ముగిసినా లబ్ధిదారులకు అందని సహాయం..
చెక్కులు మాయం.. అధికారుల నిర్లక్ష్యమా? లేక పెద్ద స్కామా?
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రజల ఆగ్రహం
బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, వేములవాడ : వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం చందుర్తి మండ‌లంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన అత్యవసర నిధుల చెక్కులే గల్లంతవుతున్నాయన్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. లబ్ధిదారులకు చేరకముందే ఆ చెక్కుల గడువు ముగిసిపోయిన ఉదంతాలు వెలుగులోకి రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన సీఎంఆర్ఎఫ్ నిధులు మధ్యలోనే మాయం కావడం వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ మండలవ్యాప్తంగా జోరందుకుంది.
అధికారుల నిర్లక్ష్యమా.. రాజకీయ దందానా?
ఈ చెక్కులు అసలు ఎక్కడ మాయమయ్యాయి? ఎవరి టేబుళ్లపై నెలల తరబడి ఆగిపోయాయి? ఇది అధికారుల ఘోర నిర్లక్ష్యమా? లేక రాజకీయ జోక్యంతో వెనుక నుంచి నడుస్తున్న పెద్ద దందానా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆసుపత్రి ఖర్చుల కోసం ఆశగా ఎదురుచూసిన పేద కుటుంబాలకు ఈ ఘటన తీవ్ర ఆవేదనను మిగుల్చుతోంది. ప్రాణాలు నిలబెట్టే ప్రభుత్వ సహాయం కూడా సమయానికి అందకపోతే పేదల పరిస్థితి ఏంటని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. కొందరు లబ్ధిదారులకు తమ పేరిట చెక్కు మంజూరైందన్న సమాచారం తెలిసినప్పటికీ, అది చేతికి అందకుండానే గడువు ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్థాయి విచారణ జరపాలి
మండలంలో ఒక్కటి కాదు.. మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మాయమైనట్లు సమాచారం బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. దీంతో ప్రజలు “ఇది సాధారణ తప్పిదం కాదు.. పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న దారుణమైన నిర్లక్ష్యం” అంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాయమైన చెక్కుల పూర్తి వివరాలను బయటపెట్టాలని, గడువు ముగిసిన చెక్కుల స్థానంలో వెంటనే కొత్త చెక్కులను జారీ చేసి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, వెనుక ఉన్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని వేములవాడ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.