epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పర్యావరణ పరిరక్షణకే గ్రీన్ ఎనర్జీ

పర్యావరణ పరిరక్షణకే గ్రీన్ ఎనర్జీ
పాలేరు నియోజకవర్గంలో రూ.37.38 కోట్లతో విద్యుత్ పనులు
తిరుమలాయపాలెంలో సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌, పాలేరు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్ సరఫరా మెరుగుదలకు పనులు చేపట్టామని, రూ.9 కోట్ల వ్యయంతో మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. దశాబ్దాలుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నాటి ఉచిత విద్యుత్ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు అందిస్తోందని గుర్తుచేశారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.

రైతులకు అండగా ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచామన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. గడిచిన ఏడాది కాలంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పేదల వైద్యం కోసం రూ.1,034 కోట్లు వెచ్చించామని, నిరుద్యోగుల కోసం 72 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారీ, జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.