epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఐల బదిలీలకు బ్రేక్..?!

సీఐల బదిలీలకు బ్రేక్..?!
వరంగల్ సీపీపై రాజ‌కీయ ఒత్తిళ్లు..!
మా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌దిలీలు వ‌ద్దంటూ ఎమ్మెల్యేల‌ రిక్వెస్ట్
ఎందుకైనా మంచిదంటూ డీజీపీ వ‌ర‌కు ఫోన్లు..!
కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా సీఐల వ్యవహారం!
సీఐల బదిలీలపై ప్రజాప్రతినిధుల పూర్తి క‌మాండ్‌
కాలపరిమితి ముగిసినా అదే స్టేషన్‌లో సీఐల తిష్ట‌
సీపీ సిద్ధం చేసిన జాబితా అమలవుతుందా..
రాజకీయ ఒత్తిళ్ల‌తో ఆ జాబితా అట‌కెక్కుతుందా..?
వరంగల్ కమిషనరేట్‌లో సీఐల బదిలీలపై హైటెన్షన్

కాకతీయ, నిఘా ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సీఐలు) బదిలీల వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ కమిషనర్ జాబితా సిద్ధం చేసినప్పటికీ, రాజకీయ జోక్యాల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కాలపరిమితి పూర్తి చేసుకున్న సీఐల వివరాలను సేకరించి బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరగాల్సిన ఈ బదిలీలు చివరి దశకు చేరుకున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయని శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో జరిగిన పోస్టింగ్‌ల సమయంలో కొందరు సీఐలు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తమకు అనుకూలమైన స్టేషన్లలో నియామకాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బదిలీల సమయంలో కూడా అదే ప్రభావం కనిపిస్తోందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

మా నియోజకవర్గంలో ఇప్పుడే బదిలీలు వద్దు..

తమ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న కొందరు సీఐలు స్థానిక రాజకీయ నాయకుల సూచనలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఉన్నతాధికారులను సంప్రదించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక ఎమ్మెల్యే స్వయంగా కమిషనర్‌ను కలిసి, తన నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న సీఐలను ప్రస్తుతానికి బదిలీ చేయవద్దని కోరిన‌ట్లు తెలుస్తుండ‌టం గ‌మ‌నార్హం. బదిలీల జాబితా సిద్ధమైన విషయం బయటకు రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసినట్లు కూడా శాఖలో చర్చ జరుగుతోంది. కొందరు ప్రత్యేక స్టేషన్లలో కొనసాగుతున్న అధికారులను అలాగే ఉంచాలని, మరికొందరిని తమకు అనుకూల ప్రాంతాలకు పంపాలని సిఫార్సులు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం ఒకే స్టేషన్‌లో ఎక్కువకాలం పనిచేసే అధికారులను బదిలీ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టాలి. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఈ నిబంధన అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు అధికారులు నాలుగు, ఐదు సంవత్సరాలకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతోంది.

ఆరోపణలున్నా చర్యలు లేవా..?

కొంతమంది సీఐలపై శాఖాపరమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమైంది. తోటి అధికారులతో విభేదాలు, సిబ్బందితో అనుచిత ప్రవర్తన, దిగువ స్థాయి అధికారులను వేధించడం వంటి ఆరోపణలు వచ్చినా బదిలీ చేయకుండా కొనసాగించడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సీఐ తన స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌ఐతో తీవ్ర విభేదాలకు దిగడంతో పాటు, గతంలో అదే స్టేషన్ లో పని చేసిన ఎస్ఐ సస్పెన్షన్‌కు కూడా పరోక్ష కారణమయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సిఐ ఓ జాతరలో పని చేస్తున్న మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో కూడా బహిరంగ దూషించారనే విభేదాలు ఉన్నప్పటికీ ఎటువంటి పరిపాలనా చర్యలు తీసుకోకపోవడం చర్చకు దారి తీసింది. కొన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మధ్య అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. కాలపరిమితి ముగిసినా బదిలీ ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నను సిబ్బందే పరస్పరం చర్చించుకుంటున్నారని సమాచారం. కొందరు అధికారులు వెళ్లిపోతారని భావించిన సిబ్బంది, బదిలీలు నిలిచిపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజల్లోనూ చర్చ..

సంబంధిత స్టేషన్లకు వచ్చే ప్రజలు, స్థానిక నాయకులు, సామాజిక వర్గాలు కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఒకే అధికారి ఎక్కువకాలం ఒకే ప్రాంతంలో కొనసాగడం వల్ల పరిపాలనా పారదర్శకత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన బదిలీల జాబితాను అమలు చేస్తారా?, లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మరికొంతకాలం వాయిదా వేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టి పోలీస్ శాఖ స్వతంత్రతను చాటుతుందా, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐల బదిలీల అంశం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజల మధ్య కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.