గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్
కాకతీయ,ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎస్సీ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు మరింత ఐక్యంగా, చురుకుగా కృషి చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఎస్సీ సామాజిక నేతల కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణ, నూతన కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున యువతను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా ము ందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గ్రామ, మండల స్థాయిల్లో ఎస్సీ సెల్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ నిరుపేద ఎస్సీ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారం దిశగా కాం గెస్ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రఘు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగిరి మధు, జిల్లా ఉపాద్యక్షుడు ఎమీ ఖలీల్ బాన్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పోషయ్య, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ బలరాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కర్ల సత్యం, వార్డు సభ్యులు ఉమ్మనేని రమేష్ | శంకరాజుపల్లి, రామన్నగూడెం సర్పంచ్లు దేవులపల్లి విజయకుమార్, గడ్డల సవీన్, ఎమీ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

