సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపులు
కాకతీయ, ఇల్లందు: సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకు, సోమవారం కార్యాలయంలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏరియాలోని అర్హులైన ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించారు. ఈ కౌన్సిలింగ్ సందర్భంగా ఏరియా సేఫ్టీ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ, క్వార్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగిందని తెలిపారు. ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికి మాత్రమే క్వార్టర్లను కేటాయించామని, త్వరలోనే వారికి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. నూతన కేటాయింపులు మరియు క్వార్టర్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ లక్ష్మణమూర్తి, సీనియర్ సిబ్బంది అధికారి సుధాకర్, సహాయకులు వీరన్న, రాజశేఖర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

