epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్వాక్రా రుణాల్లో మాయాజాలం

డ్వాక్రా రుణాల్లో మాయాజాలం
ఏదులాపురం మున్సిపాలిటీలో స్తంభించిన రుణాలు
ఏడాది దాటినా అందని ఆర్థిక సాయం..
కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు
కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ మాటలు నీటిమూటలేనా?
అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆశ్రయం.
890 గ్రూపుల్లో సుమారు 89 వేల మందిపై ప్రభావం
డేటా ఎంట్రీ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు

కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం.. ఆర్థికంగా బలోపేతం చేస్తాం అంటూ వేదికలెక్కినప్పుడల్లా పాలకుల నుంచి వినిపించే ఊదరగొట్టే ప్రసంగాలు, క్షేత్రస్థాయికి వచ్చేసరికి నీటిమూటలవుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ‘ఏదులాపురం’లో డ్వాక్రా మహిళల పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వ హామీలకు, ఆచరణకు మధ్య ఉన్న అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది గడిచినా, వేలాది మంది మహిళలకు అందాల్సిన రుణాలు మాత్రం గాలిలోనే ఉన్నాయి. మహిళా సంఘాలకు అందే డ్వాక్రా, స్త్రీనిధి రుణాలు వారి పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, చిన్నపాటి వ్యాపారాలకు భరోసానిస్తాయి. అయితే ఏదులాపురంలో గత కొన్ని నెలలుగా రుణాలు నిలిచిపోవడంతో మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “నా బిడ్డ పెళ్లి కోసం అప్పు కోసం తిరగని కార్యాలయం లేదు, చివరకు బయట రూ. 2 వడ్డీకి తెచ్చి వివాహం చేశాను” అంటూ ఓ తల్లి కార్యాలయం ఎదుట అధికారుల ముందు వాపోయిన తీరు, అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్థికంగా ఎదగాల్సిన మహిళలు, రుణాల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం దేనికీ సంకేతం?

890 గ్రూపులు.. 89 వేల మందిపై ప్రభావం
ఖమ్మం రూరల్ మండలంలో గతంలో 3 వేల గ్రూపులు ఉండగా, మున్సిపాలిటీగా మారిన తర్వాత ఏదులాపురంలో 890 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉన్నా, సుమారు 89 వేల మంది మహిళల జీవనోపాధి ఈ రుణాలు మంజూరు కావడంలోనే ఉంది. వీరికి సహకరించాల్సిన గ్రామ దీపికలు ఉన్నా, లోన్ల ప్రక్రియ మాత్రం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి రాగానే మరుగున పడిపోవడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ‘డేటా’ సాకు.. మౌనంగానే సర్దుకుపోవాలా?
రుణాల జాప్యంపై అధికారులను వివరణ కోరితే, “గ్రామాలను మున్సిపాలిటీ వార్డులుగా మార్చినందున డేటా ఎంట్రీలో ఆలస్యం జరిగింది” అని డీసీఎం సుజాత సమాధానమిస్తున్నారు. మున్సిపాలిటీగా మారి ఏడాది గడిచినా, డేటా ఎంట్రీ సమస్యతో రుణాలను ఆపేయడం ఎంతవరకు సమంజసమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నా, రుణాలు మాత్రం ఇప్పటికీ మహిళల ఖాతాల్లోకి చేరడం లేదు. పాలకుల మాటలకు, అధికారుల ఆచరణకు పొంతన లేకపోవడంతో మహిళలు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఏదులాపురంలోని మహిళా సంఘాలకు తక్షణమే రుణాలు విడుదల చేయాలని, లేనిపక్షంలో కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ‘కోటీశ్వరుల’ హామీ కేవలం ఎన్నికల వరకు మాత్రమేనా? లేక నిరంతర ప్రక్రియనా? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.