epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేరుకే ఎమ్మెల్సీ.. పనులేమో దరిద్రాలు!

పేరుకే ఎమ్మెల్సీ.. పనులేమో దరిద్రాలు!
ఆయ‌న ఫామ్ హౌస్‌లలో పేకాట, గంజాయి, డ్రగ్స్ దందా
శ్రీరంగనీతులు చెప్పే నాయకులకు అక్రమాలే అలవాటు
గుప్తనిధుల కోసం కొండలను కొల్లగొట్టిన ధ‌ర్మారెడ్డి
పోచంపల్లి,చల్లాపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
నడికూడ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

కాకతీయ, పరకాల : పేరుకే ఎమ్మెల్సీ అని, చేసే పనులన్నీ దరిద్రపు పనులేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నడికూడ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. నాగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంపై ఆయన మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సింది పోయి, చిల్లర మల్లర రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు శ్రీరంగనీతులు చెప్పే నాయకులు ఆచరణలో మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని రేవూరి ఆరోపించారు. ఫామ్ హౌస్‌లలో పేకాట, గంజాయి, డ్రగ్స్, బ్రోకరేజ్ వంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత కలిగిన వారు, ఆ దందాలను ప్రోత్సహించి డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రాని నాయకులు, పదవి పోయాక కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో చేస్తున్న ప్రదర్శన కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని కొట్టిపారేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో రౌడీయిజం

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడం వారి రౌడీయిజానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు దొరికిన కాడికి దోచుకుని ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులు, ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నట్లు నటిస్తున్నారని చ‌ల్లా ధ‌ర్మారెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.

గుప్తనిధుల కోసం గుట్టలను కొల్లగొట్టారు

కౌకొండ గుట్టలలో గుప్తనిధుల కోసం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆయన వియ్యంకుడు, అల్లుడితో కలిసి అర్ధరాత్రి తవ్వకాలు జరిపారని ఎమ్మెల్యే రేవూరి ఆరోపించారు. అంతేకాకుండా, గుట్టలను తవ్విన మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు విక్రయించి కూడా అక్రమ లాభాలు పొందారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల లెక్కలేనన్ని భూములను కొనుగోలు చేసి భారీగా ఆస్తులు కూడబెట్టారని, అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఇప్పుడు ఈ రాజకీయ ప్రదర్శనలు చేస్తున్నారని ఆరోపించారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా ఉండాలని, ఇలాంటి అక్రమ రాజకీయాలకు స్వస్తి పలకాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. గతంలో అధికార పదవులు అనుభవించిన సమయంలో ప్రజలు గుర్తుకు రాని నాయకులకు ఇప్పుడు ప్రజలపై ప్రేమ పుట్టడం ఆశ్చర్యంగా ఉందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.