epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మైరాడాను మోసం చేస్తున్న ఉద్యోగులు

మైరాడాను మోసం చేస్తున్న ఉద్యోగులు
కొత్తపల్లి చెరువు పూడికతీతలో లీలలు బహిర్గతం
ఫామ్ ఫండ్ పనుల పేరిట రైతుల నుంచి వ‌సూళ్లు
స్వ‌చ్ఛంద సంస్థ ల‌క్ష్యాల‌కు గండికొడుతున్న క్షేత్ర‌స్థాయి సిబ్బంది
ఐదేళ్లుగా ఒకే కాంట్రాక్టర్.. బైఫ్‌లో చేసిన వారే..మైరాడాలోనూ వారే

కాక‌తీయ‌, దుమ్ముగూడెం : రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది మైరాడా స్వచ్ఛంద సంస్థ. అయితే, సంస్థ నిర్దేశించుకున్న గొప్ప లక్ష్యాలను పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు స్వార్థానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిస్వార్థంగా సేవలందించే సంస్థ ఆశయాలకు గండికొడుతూ, అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్న వైనం ఇప్పుడు దుమ్ముగూడెం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మైరాడా సంస్థ ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో పనులను చేపడితే, ఇక్కడే అక్రమార్కుల కథ మొదలవుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, అమాయక రైతులతో గ్రూపులు కట్టించి వారిని మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఉద్దేశం రైతులకు లబ్ధి చేకూర్చడం అయితే, వీరు మాత్రం రైతులకు వచ్చే ప్రయోజనంలో పావు వంతు మాత్రమే అందించి, మిగిలిన ముప్పావు వంతు సొమ్మును కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా కొత్తపల్లి, నారాయణరావు పేట పంచాయతీలలో చేపట్టిన చెరువు పూడికతీత, ఫామ్ ఫండ్ పనుల్లో జరిగిన అక్రమాలే దీనికి నిదర్శనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ తెలిసినా.. మౌనం ఎందుకు..!
ఒక్కో ఫామ్ ఫండ్ పని కోసం రైతుల వద్ద నుంచి 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ విష‌యంపై ఫిర్యాదులు అందినా వారిపై చర్యలు తీసుకునే వారు కరువయ్యారంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఐటీసీ ఎమ్మెస్కేలో పనిచేసే ఒక టెక్నికల్ అసిస్టెంట్ సహకారంతోనే ఈ తంతు అంతా నడుస్తోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ‘బైఫ్’ స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన వ్యక్తులే, మైరాడాలోకి చేరి అదే పాత పద్ధతుల్లో దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. 2015-2020 కాలంలో వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని, ఇప్పుడు ఒకరు కాంట్రాక్టర్‌గా, మరొకరు పీసీగా మారి అందినకాడికి దండుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

సంస్థ ప్రతిష్ఠను కాపాడాలి
సంస్థ పేరును అడ్డుపెట్టుకుని, రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ఈ సిబ్బంది తీరుతో మైరాడా ప్రతిష్ఠకు మచ్చ కలుగుతోంది. సంస్థ యొక్క సేవా దృక్పథానికి ఎటువంటి అపవాదులు రాకుండా ఉండాలంటే, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై, కాంట్రాక్టర్లపై ఐటీసీ మరియు మైరాడా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేపడితేనే, నిజమైన లబ్ధిదారులైన రైతులకు న్యాయం జరుగుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.