కాకతీయ ఎఫెక్ట్
ప్రజారోగ్యంతో చెలగాటం వార్తపై స్పందించిన అధికారులు
యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం

కాకతీయ, చేర్యాల: కాకతీయ పత్రికలో “ప్రజారోగ్యంతో చెలగాటం” శీర్షికతో ప్రచురితమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వాటర్ ట్యాంకు సమస్యను గుర్తించి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు.అనంతరం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు కాకతీయ పత్రికలో వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించి పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


