epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్యే ఆదిపై కుట్రలు ఫలించవు

ఎమ్మెల్యే ఆదిపై కుట్రలు ఫలించవు
రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలు
ధాన్యం అక్రమ రవాణా కేసుతో ప్రభుత్వ విప్‌కు ఎలాంటి సంబంధం లేదు
ఆధారాలు లేని విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనం
కాంగ్రెస్ నాయ‌కుడు బొల్లి కుమార్‌

కాకతీయ, వేములవాడ : రాజకీయంగా ఎదుర్కోలేకనే వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై ప్రతిపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని నాయకుడు బొల్లి కుమార్ మండిపడ్డారు. ఆది శ్రీనివాస్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ప్రజా నాయకుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఇటీవల వేములవాడ నియోజకవర్గ పరిధిలో వెలుగులోకి వచ్చిన ధాన్యం అక్రమ రవాణా కేసుతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. కావాలనే ఆయన పేరును ఈ వ్యవహారంలోకి లాగేందుకు కొందరు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారని బొల్లి కుమార్ ఆరోపించారు. ఈ కేసులో పట్టుబడిన ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందనే ఏకైక కారణంతో, ప్రభుత్వ విప్‌ను ఆ కేసుతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

నిజం చివరకు గెలుస్తుంది
మన దేశంలో చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, ఎవరైనా తప్పు చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం తమ పని తాము చేసుకుపోతాయని బొల్లి కుమార్ తెలిపారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, బురదజల్లే రాజకీయం చేస్తూ ప్రజాప్రతినిధులపై తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఆది శ్రీనివాస్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు ఇటువంటి దుష్ప్రచారానికి తెరలేపారని, అసత్యాలు ఎప్పటికీ సత్యాలుగా మారవని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, నిజం చివరకు గెలుస్తుందని బొల్లి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.