పేద యువతి వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం
కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన పేద యువతి వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. గ్రామానికి చెందిన బండారి రాములు, దివంగత మల్లవ్వ దంపతుల కుమార్తె దీప్తి (శ్రీజ) వివాహ సందర్భంగా, ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి రూ.10 వేల విలువైన టేక్ మంచాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు తమ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైన సమయంలో అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నేరేళ్ల విజయ్, బోయిని రంజిత్, కర్ల లక్ష్మణ్, కర్ల తిరుపతి, కట్ట నరసింహారెడ్డి, కర్ల అరుణ్, పండుగు బాబు, దూది శ్రీనివాస్, బొంగోని శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

