వేములవాడ వీహెచ్‌పీ నూతన కమిటీ
పట్టణ అధ్యక్షుడిగా పల్లె శ్యాంసుందర్ రెడ్డి ఏకగ్రీవం
ధర్మ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తామన్న నూతన సభ్యులు
కాకతీయ, వేములవాడ: విశ్వ హిందూ పరిషత్ వేములవాడ పట్టణ నూతన కమిటీ ఎన్నిక సోమవారం గాయత్రీ మాత ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లె శ్యాంసుందర్ రెడ్డిని పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భారత సైన్యంలో పద్దెనిమిదేళ్లు సేవలందించిన శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపై హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ సంఘటన కోసం పూర్తి సమయం కేటాయిస్తానని తెలిపారు. దేశం, ధర్మం, సంస్కృతి పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని నూతన సభ్యులు పేర్కొన్నారు. కమిటీలో గుండోజి గోపాల్ కార్యదర్శిగా, చేకూర్తి నవీన్, తోట అజయ్ ఉపాధ్యక్షులుగా, పుల్లూరి ఆంజనేయులు సహ కార్యదర్శిగా, జక్కం శివప్రసాద్ సామాజిక సమరసత ప్రముఖ్‌గా, హరచారి శ్రీరామ్ శర్మ బజరంగ్ దళ్ సహ సంయోజక్‌గా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శులు గడప కిషోర్ రావు, నాగుల రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

