epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉత్త‌రం కాకతీయ పత్రిక కథనాలు అక్షర సత్యాలు

ఉత్త‌రం కాకతీయ పత్రిక కథనాలు అక్షర సత్యాలు
విలేకరులపై బురద చల్ల‌డం మానుకోవాలి
సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణ శూన్యం
నడి గోదావరిలో లారీల లోడింగ్
: బీజేపీ నేత లింగంపల్లి రమేష్
త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు

కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నిబంధనలు, చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని భద్రాద్రి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు, హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన ‘కాకతీయ’ పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న దోపిడీపై గత కొన్ని రోజులుగా కాకతీయ పత్రికలో వస్తున్న కథనాలు నూటికి నూరు శాతం నిజమని కొనియాడారు. వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న విలేకరులను టార్గెట్ చేస్తూ.. ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్ తన బినామీలతో పత్రికపై బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

నడి గోదావరిలో లారీలు.. ఏ జీవోలో ఉందో చూపించండి!
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో శ్రీకర్ స్వయంగా గతంలో అక్రమాలు, అవినీతి జరిగాయని ఒప్పుకున్నారని.. మరి ఇప్పుడు ర్యాంపుల్లో అవినీతి జరగడం లేదా? అని లింగంపల్లి రమేష్ ప్రశ్నించారు. అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని ఇసుక దందాతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి నదిలో డీసిల్టేషన్ (పూడికతీత) పేరుతో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ సాగుతోందన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా నడి గోదావరిలోకి లారీలను దింపి ఇసుక లోడింగ్ చేయడం దుర్మార్గమని.. అలా నది లోపలికి వాహనాలు తీసుకెళ్లవచ్చని ఏ జీవోలో ఉందో పాలకులు, అధికారులు చూపించాలని డిమాండ్ చేశారు.

పట్టా భూముల పేరుతో అర్ధరాత్రి దందా
ఇసుక క్వారీల్లో ఎలాంటి సమయపాలన పాటించడం లేదని, అర్ధరాత్రుళ్లూ ఇష్టమొచ్చినట్లు తోలకాలు సాగిస్తున్నారని రమేష్ ఆరోపించారు. అంతకంటే ముఖ్యంగా పట్టా ల్యాండ్స్ (పట్టా భూములు) పరిధిలో డీసిల్టేషన్ పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని చెప్పారు. గోదావరి పాయ అవతలకు వెళ్లి, నీటిని తొలగించి మరీ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలను ఉపయోగించి దందా చేస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎలాంటి రశీదులు లేని ‘జీరో’ లారీలు యథేచ్ఛగా తరలుతున్నాయని, అందుకే మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు పోలీసులు ఆయా లారీలను పట్టుకుంటున్నారని గుర్తుచేశారు.

అధికారుల పర్యవేక్షణ శూన్యం.. బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం
క్వారీల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాల పర్యవేక్షణ గానీ, మైనింగ్, రెవెన్యూ అధికారుల నిఘా గానీ ఎక్కడా కనిపించడం లేదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లు గోదావరిని పూర్తిగా దోచేస్తున్నారని రమేష్ ధ్వజమెత్తారు. ఇసుక దందా అంశంపై తాము ఇప్పటికే బీజేపీ జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చలు జరిపామని, త్వరలోనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అక్రమాలను అడ్డుకోకపోతే, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇసుక ర్యాంపుల వద్ద బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని లింగంపల్లి రమేష్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.