epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దారి తప్పుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు

దారి తప్పుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు
కేటాయింపులు భారీగా ఉన్నా అమలులో శూన్యం
ప్రతి పోడు భూమికి ప్రభుత్వం పట్టాలివ్వాలి
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం!
సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా
గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రాంబాబు

కాకతీయ, ఖమ్మం : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతుండడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఏటా కోట్లాది రూపాయల కేటాయింపులు జరుగుతున్నా, అవి ఖర్చు కాకపోవడంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, అంతా ‘అంకెలు గణం – అమలు శూన్యం’ అన్న చందంగా తయారైందని విమర్శించారు. తెలంగాణ గిరిజన సమాఖ్య విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో బానోత్ రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మౌలానా మాట్లాడుతూ.. నిధులు పక్కదారి పడుతుండడం వల్లే ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడిపోతున్నాయని పేర్కొన్నారు.

పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలి
గతంలో సాగులో ఉన్న ప్రతి ఎకరా పోడు భూమికి పట్టా అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కానీ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను సైతం గిరిజనుల నుంచి లాక్కుంటున్నారని మౌలానా ఆరోపించారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన హామీ మేరకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టా ఇవ్వాలని, లేని పక్షంలో గిరిజనులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా పోడు భూముల్లో బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు సైతం రైతు భరోసా వర్తింపజేయాలని, గిరిజన విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు అందించి ఉన్నత విద్యకు తోడ్పాటునందించాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు ఎన్నిక
పాల్వంచలో త్వరలో జరగబోయే తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలకు ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని మౌలానా పిలుపునిచ్చారు. కాగా, ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి బానోత్ జగన్, బానోత్ రామ్మూర్తి, పాల్తియా శ్రీనివాస్, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.