epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శెభాష్‌..స‌ర్పంచ్ సాబ్‌..!

శెభాష్‌..స‌ర్పంచ్ సాబ్‌..!
సర్పంచ్ రాఘవేంద్ర చొరవతో పాఠ‌శాల పునఃప్రారంభం
సూర్యతండాలో గ్రామ పంచాయతీలో విద్యావెలుగులు
20 ఏళ్ల తర్వాత సాకారమైన గ్రామస్తుల కల
ప్ర‌భుత్వ బ‌డిని నిల‌బెట్టేందుకు వినూత్న ప‌థ‌కం
ఇంటి పన్ను, నల్లా పన్ను చెల్లింపున‌కు స‌ర్పంచ్‌ ముందుకు
గ్రామ‌స్థులు, త‌ల్లిదండ్రుల నుంచి అనుహ్య స్పంద‌న‌

కాకతీయ, గీసుగొండ: రెండు దశాబ్దాలుగా మూతపడిన సూర్యతండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సర్పంచ్ బానోతు రాఘవేంద్ర చొరవతో శుక్రవారం పునఃప్రారంభమై గ్రామస్థుల 20 ఏళ్ల కలను సాకారం చేసింది. గ్రామస్తుల సహకారం, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఈ పాఠశాల తిరిగి తెరుచుకుంది. మండలంలోని సూర్యతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పాఠశాలను వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, గీసుగొండ మండల విద్యాశాఖ అధికారి రవీందర్ కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన అధికారులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర మాట్లాడుతూ, గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత, ఉపాధ్యాయుల సేవాభావం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉదయం అల్పాహార పథకం వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించామని, తద్వారా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సర్పంచ్, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను, నల్లా పన్నును గ్రామ పంచాయతీకి తానే చెల్లిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు, గీసుగొండ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ శరత్, సూర్యతండ ఉపసర్పంచ్ వాంకుడోత్ రాధా, గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరేష్ కుమార్, కాంగ్రెస్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు లావుడియా రాజన్న, వాంకుడోత్ అమర్ సింగ్, వాంకుడోత్ రాజు, బానోతు నర్సింగం, అజ్మీర నరసింహ, అజ్మీర సారయ్య, వాంకుడోత్ ఓంకార్, ఆంగోతు సక్రు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.