ములుగు ఎస్పీని కలిసిన జర్నలిస్టుల బృందం
వార్తల ప్రచురణపై నోటీసుల జారీ అంశంపై సానుకూల స్పందన
కాకతీయ, ములుగు ప్రతినిధి : వార్తా ప్రచురణపై పోలీసులు జారీ చేసిన నోటీసుల అంశంపై ములుగు జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ సానుకూలంగా స్పందించారు. గురువారం ఎస్పీని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టుల బృందం, తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. వార్తలు రాసినందుకు నోటీసులిచ్చి జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై ఇలాంటి ఒత్తిళ్లు తగవని ఎస్పీకి వివరించారు. దీనిపై స్పందించిన ఎస్పీ, జర్నలిస్టుల ఆందోళనను అర్థం చేసుకున్నామని, బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ హామీతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, సాయిరాం, కంకణాల సంతోష్, ప్రశాంత్, అనిల్, బొక్క దయాసాగర్, టీవీ రాజు, వంశీ మోహన్, హరికృష్ణ, మోహన్ రావు, ఉత్తరం కాకతీయ ఎడిటర్ కిరణ్ గౌడ్, దాసరి ధనుంజయ, పల్లెబోయిన నాగరాజు, సలేంద్ర రవీందర్, నరేశ్ గౌడ్, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

