బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన
రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన నేతలు
కాకతీయ, పినపాక: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్రోడ్లో భారీ నిరసన, ర్యాలీ నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వరుస పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన కేసులు, ఆయన అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దిశా కమిటీ అధ్యక్షులు మద్దెల సమ్మయ్య, ఎస్సీ సెల్ నాయకులు ప్రసాద్, సర్పంచులు అలివేలు, స్వప్న, అనిత, వెంకటేశ్వర్లు, మట్ట బాబురావు, చందర్రావు, ఉప సర్పంచ్లు సందీప్, శిరీష, రామ్మోహన్, నవీన్, అచ్చ నవీన్, కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, హేమంత్, మహిళా విభాగ ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

