- ఏఎంఆర్ ఓసీ-1లో నిలిచిన బొగ్గు వెలికితీత
కాకతీయ, మలహర్ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని తాడిచర్ల ఏఎంఆర్ ఓసీ-1 గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల ప్రభావంతో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ఊబి తొలగింపు పనులు నిలిచిపోయాయని తెలిపారు. వర్షాల కారణంగా గనిలో పనులు మందగించినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే ఉత్పత్తి, ఊబి తొలగింపు పనులను వేగవంతం చేసి సాధారణ స్థితికి తీసుకొస్తామని వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కేఎస్‌ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు.

