ఉల్లంపల్లి గ్రామసభలో కీలక తీర్మానాలు
ఆర్వో ప్లాంట్, గ్రంథాలయం, పీహెచ్సీ ఏర్పాటుకు తీర్మానం
గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంపై దృష్టి
కాకతీయ, చిగురుమామిడి: ఉల్లంపల్లి గ్రామపంచాయతీలో సోమవారం సర్పంచ్ అలువాల శంకర్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పలు అభివృద్ధి తీర్మానాలను ఆమోదించారు. 20 శాతం ప్రజల భాగస్వామ్యం, 80 శాతం బాలవికాస్ సంస్థ సహకారంతో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామంలో గ్రంథాలయం, వెటర్నరీ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వాన్ని కోరారు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ కార్యక్రమాలు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని గ్రామసభ తీర్మానించింది. సమావేశంలో వార్డు సభ్యులు కొల రజిత, కానవేని రజినీకాంత్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వివో శ్రీలత, పద్మ, శారద, జమున, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

