ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల రాస్తారోకో
కాకతీయ, గంభీరావుపేట: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట–కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి, స్కాలర్‌షిప్‌ల విడుదలతో పాటు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ నాయకుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

