స్కై స్కూల్లో బోనాల సందడి
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో గల స్కై స్కూల్లో మంగళవారం తెలంగాణ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలో విన్యాసాలు ప్రదర్శించగా, విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన బోనాల ప్రదర్శన స్థానికులను అలరించింది. ఈ సందర్భంగా వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల కరస్పాండెంట్ మహేష్ ఆసారి తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపల్ జమున, ఉపాధ్యాయులు తులసిరామ్, శైలజ, స్రవంతి, దివ్య, మమత, చంద్రకళ, హర్షిత, సౌందర్య, త్రివేణి, అంజలి, మౌనిక, కావేరి, పాఠశాల ఇంచార్జి జక్కుల మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

