పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలోని మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పోతరాజులు, అమ్మవారి వేషధారణలో విన్యాసాలు ప్రదర్శించారు. పాఠశాల నుంచి పోచమ్మ దేవాలయం వరకు నిర్వహించిన ర్యాలీ భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మెంగళి కవిత, కముటం స్వప్న, మున్నీరా, ఇందూరి సౌమ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

