ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఓబీసీ సన్మానం
సెక్రటరీ ప్రవీణ్‌తో పాటు ఈసీ సభ్యులకు అభినందనలు
కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌లోని ఓబీసీ కార్యాలయంలో ఆఫీసర్స్ క్లబ్ నూతన సెక్రటరీ పొక్కుల ప్రవీణ్, ఈసీ సభ్యులు గట్టు రాజు, పల్లం రవి, మంచికుంట్ల ప్రవీణ్లను ఓబీసీ కమిటీ ఘనంగా సన్మానించింది. మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆత్మీయ సమావేశం నిర్వహించి, అనంతరం శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, భూపాలపల్లి జేఏసీ అధ్యక్షుడు సూరం రవీందర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర సలహాదారు వేణుమాధవ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్, గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ఎరుకొండ పవన్, బీసీ అడ్వకేట్స్ సంఘం నాయకుడు బండా వివేకానంద, బీసీ మహిళా నేతలు పద్మజ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

