బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక చేయూత
కాకతీయ, కారేపల్లి: కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిరుముల రాములు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ మంగళవారం పరామర్శించారు. దశదిన కార్యక్రమానికి హాజరైన ఆయన, రాములు భార్య ఎల్లబ్బాయికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డొంకిన రవీందర్ గౌడ్, పాలిక వీరస్వామి, వెంకటేశ్వర్లు, చింతల సంపత్, ఎండీ ఖలీలుల్లా ఖాన్, సోమందుల వెంకటేశ్వర్, షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

