తిరుపతిలో వ్యభిచార గృహంపై దాడి
ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్
ఇద్దరు మహిళలను రక్షించి హోంకు తరలింపు
కాకతీయ, తిరుపతి : తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కారంపల్లి సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలను రక్షించి హోంకు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు అక్కారంపల్లి సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో అలిపిరి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆర్గనైజర్ ఎం. అలివేలు మంగమ్మతో పాటు యు. గోవర్ధన్, టి. తిరువేసు, జి. సాయిబాబును అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలం నుంచి రూ.1,500 నగదు, 10 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. బాధిత మహిళలను రక్షించి సంబంధిత హోంకు తరలించినట్లు వెల్లడించారు. వ్యభిచార కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

