సైబర్ నేరాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష
చేర్యాలలో పోలీసుల అవగాహన ర్యాలీ
ఓటీపీ, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని సూచన
కాకతీయ, చేర్యాల : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చని పోలీసులు సూచించారు. ‘సురక్షా తిరంగా సైబర్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం చేర్యాల పట్టణంలో జాతీయ రహదారిపై వివిధ కళాశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాసవి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్ మోసాల తీరుతెన్నులను వివరించారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ర్యాలీలో సీఐ బానోత్ రమేష్ నాయక్, ఎస్‌ఐలు అపూర్వ రెడ్డి, మహేష్, ఆశీఫ్, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

