epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి

కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా తేలేదు
కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి
కేంద్ర పథకాలతోనే కీలక అభివృద్ధి పనులు
కరీంనగర్‌కు ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల ప్యాకేజీ తేవాలి
ఆర్వోబీ పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నలు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులే ప్రధాన ఆధారమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగర అభివృద్ధి కోసం ఒక్క భారీ పథకాన్ని కూడా తీసుకురాలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. కేంద్ర పథకాల ద్వారా వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడం మానుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నగర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక్క భారీ పథకాన్ని తీసుకురాలేదని ఆరోపించారు. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

కేంద్ర పథకాలతోనే కీలక పనులు

కరీంనగర్‌లో చేపట్టిన స్మార్ట్‌సిటీ, అమృత్‌-1, అమృత్‌-2, యూఐడీఎఫ్‌, యూసీఎఫ్‌, సీఆర్‌ఎఫ్‌ తదితర పథకాలు కేంద్ర ప్రభుత్వ చొరవతోనే వచ్చాయని సునీల్‌రావు తెలిపారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 50 శాతం వాటా ఉందని, మొత్తం 46 పనుల్లో 41 పూర్తయ్యాయని చెప్పారు. అమృత్‌ పథకం రెండు విడతల్లో రూ.274 కోట్లు, మూడో విడతలో మరో రూ.80 కోట్లు కరీంనగర్‌కు వచ్చినట్లు వివరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ చొరవతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.840 కోట్ల నిధులు సమకూరే అవకాశం ఏర్పడిందన్నారు.

రూ.1,000 కోట్ల ప్యాకేజీ తేవాలి

నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం రూ.1,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. రూ.1,000–2,000 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొస్తే కాంగ్రెస్‌ నేతలకు పౌర సన్మానం చేస్తామని ప్రకటించారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి విషయంలో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, అయితే నిధులు తెచ్చింది ఎవరు, టెండర్లు పిలిచింది ఎవరు, ఇప్పటివరకు భూసేకరణ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. సేతుబంధన్‌ కింద కేంద్రం రూ.156 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేని ఒక్క పథకాన్నైనా కాంగ్రెస్‌ నేతలు చూపించాలని సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చిందో ప్రజలకు వివరించాలని కోరారు. బండి సంజయ్‌కుమార్‌ చొరవతోనే కరీంనగర్‌ను యూసీఎఫ్‌ పథకంలోకి తీసుకురావడం సాధ్యమైందని, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో హడ్కో ద్వారా రాష్ట్రానికి నిధులు సమకూరే అవకాశం ఏర్పడిందని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.