epaper
Sunday, September 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మొండి వైఖరి వీడండి.. రైతులకు నీళ్లివ్వండి

మొండి వైఖరి వీడండి.. రైతులకు నీళ్లివ్వండి
ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేసే వరకు శ్రమించేది లేదు
రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం
ఎండిపోతున్న పంటలను చూసి ఊరుకోం
పోరాటం ఉధృతం చేస్తాం
:మాజీమంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు

కాకతీయ, రాయపర్తి : ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సోమవారం మైలారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ నుంచి మడూర్‌ కెనాల్‌ వరకు కాలువ వెంట ఆయన భారీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని గులాబీ జెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించకుండా, విద్యుత్‌ కోతలతో మరింత ఇబ్బందులకు గురిచేస్తూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

నీళ్లు విడుదల చేసే వరకు పోరాటం

ఎండిపోతున్న పంటలను చూస్తూ తాము ఊరుకునేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నీటిని విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రైతులు కూడా స్పష్టం చేశారు. పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మూనావత్‌ నరసింహా నాయక్‌, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌, పార్టీ కార్యకర్తలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.