epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూభారతి పేరుతో భూదందా!

భూభారతి పేరుతో భూదందా!
లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చారు
50 శాతం వాటాలు, భారీగా లంచాల డిమాండ్‌
రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి
సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవం
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భూదందాలు, సెటిల్‌మెంట్ల రాజ్యం నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘భూభారతి’ పేరుతో ప్రైవేటు భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి సెటిల్‌మెంట్లకు తెరతీశారని విమర్శించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే సుమారు నాలుగు లక్షల ఎకరాల భూములను 22ఏలో చేర్చినట్లు ఆరోపిస్తూ.. గత రెండుమూడేళ్లలో నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా మున్సిపల్‌ అనుమతులు పొంది, పన్నులు చెల్లిస్తూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను సైతం 22ఏలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సెటిల్‌మెంట్ల పేరుతో 50 శాతం వాటాలు, భారీగా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, దేవాదాయ భూములకు మాత్రమే వర్తించాల్సిన 22ఏ జాబితాలో ప్రైవేటు ఆస్తులను చేర్చడంపై సమగ్ర విచారణ అవసరమన్నారు. హైడ్రా వ్యవహారంలోనూ పేదలకు ఒక న్యాయం, మజ్లిస్‌, కాంగ్రెస్‌ నేతలకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సిన పరిస్థితి వచ్చిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. భూ బాధితులకు మండల స్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్‌ సెల్‌ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.

రేషన్‌ బియ్యంపై కేంద్ర లోగో ఏదీ?

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం 70 శాతానికి పైగా సబ్సిడీ భరిస్తూ పేదలకు ఐదు కిలోల ఉచిత బియ్యం అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ లోగోతో పంపిణీ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ పేరు, భారత ప్రభుత్వ లోగో లేకుండా ముఖ్యమంత్రి, పౌరసరఫరాల మంత్రి ఫొటోలు మాత్రమే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం అందిస్తున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాలేజీలకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిధులు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా శుద్ధి చట్టబద్ధ ప్రక్రియ

ఓటర్ల జాబితా శుద్ధి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న చట్టబద్ధ ప్రక్రియ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ఒక వ్యక్తి.. ఒకే ఓటు’ విధానంలో భాగంగా డబుల్‌ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బీఎల్‌వోలు పనిచేస్తున్నప్పటికీ కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో గ్రామీణ ఓట్లను తగ్గించి మజ్లిస్‌కు లబ్ధి చేకూర్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను భయపెట్టారని ఆయన ఆరోపించారు. గ్రామంలో ఓటు నమోదు చేసుకోకపోతే రేషన్‌ కార్డులు, భూములు, ఆస్తులు, పెన్షన్లు పోతాయని సీఎం చేసిన ప్రకటనలతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో 9.35 లక్షల ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.

విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం

రజాకార్ల అరాచకాలకు, నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కలంతో పోరాడిన ‘ఇమ్రోజ్‌’ పత్రిక ఎడిటర్‌ షోయబుల్లా ఖాన్‌ వర్ధంతి సందర్భంగా కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం ఎగరాలని, అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావాలని కోరినందుకు రజాకార్లు ఆయనను 1948 ఆగస్టు 21న కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో హత్య చేశారని గుర్తుచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’ నిర్వహించనున్నట్లు తెలిపారు. పారామిలిటరీ కవాతు, తెలంగాణ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో దశాబ్దాలుగా అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ.. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మజ్లిస్‌ భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్వహించడం లేదని విమర్శించారు. విదేశీ పర్యటనల అనుమతుల విషయంలో రాజకీయ కక్షసాధింపులు లేవని, దౌత్య నిబంధనలు, భద్రతా ప్రోటోకాల్స్‌ ప్రకారమే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయాలు తీసుకుంటుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనూ బీజేపీ మంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు రాని సందర్భాలున్నాయని తెలిపారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. పార్లమెంట్‌ వద్ద ఆందోళనల విషయంలో రాహుల్‌గాంధీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.