epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల భూమిని లాక్కునే కుట్ర!

పేదల భూమిని లాక్కునే కుట్ర!
2005 నుంచే గుడిసెల్లో ఉంటున్నారు
ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం
కోర్టు వివాదంలో ఉన్న భూమిలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు?
దొంగ పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం
పేదల పక్షాన పోరాడతాం
మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

కాకతీయ, కాజీపేట : వైఎస్‌ఆర్‌ నగర్‌లో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, బీఆర్‌ఎస్‌ నేత దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. షాపూర్‌ ఇరాని కుటుంబ సభ్యులమంటూ కొందరు వచ్చి గుడిసెవాసులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2005 నుంచే పేదలు అక్కడ నివసిస్తున్నారని, వారికి ఇంటి నంబర్లు, ఆధార్‌, ఓటర్‌ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. సోమవారం వైఎస్‌ఆర్‌ నగర్‌లో గుడిసెవాసులను కలిసి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
కోర్టు వివాదంలో ఉన్న భూమిపై మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చిందని వినయ్‌భాస్కర్‌ ప్రశ్నించారు. దొంగ పత్రాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

పేదలను భయపెడుతున్నారు

వైఎస్‌ఆర్‌ నగర్‌ గుడిసెవాసులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామంటూ భయపెడుతున్నారని వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు నిర్మాణాలకు వినియోగించడం సరికాదన్నారు. ఆ భూమిలో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని సూచించారు. గుడిసెవాసులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగుల కోసం భూమి కేటాయించే విషయంలో తమపై కేసులు నమోదు చేశారని వినయ్‌భాస్కర్‌ తెలిపారు. అయితే ఆ కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. ఇప్పుడు అదే భూమిపై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని గుడిసెవాసులు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు వరకు పోరాటం

పేదల హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని వినయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అనంతరం రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగులతోనూ మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.