epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు
వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి
ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌నిచేయాలి
సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు
టీడీఎంయూ లోగో ఆవిష్క‌ర‌ణ‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ శ్వేత

కాకతీయ, హన్మ‌కొండ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత అన్నారు. వార్త కంటే వాస్తవం ముఖ్యం. సంచలనం కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమ‌ని అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ డిజిట‌ల్‌మీడియా యూనియ‌న్ అధికారిక లోగోను క‌మిష‌న‌ర్ శ్వేత ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జర్నలిస్టు చేతిలోని కలం సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందని అన్నారు. అదే సమయంలో నిర్ధారణ లేని సమాచారం ప్రచురిస్తే వ్యక్తుల గౌరవానికి, ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఏదైనా వార్తను ప్రచురించే ముందు దాని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఒక సమాచారం సంచలనాత్మకంగా ఉన్నంత మాత్రాన దాన్ని వెంటనే వార్తగా మార్చకూడదని అన్నారు.

ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి

ప్రస్తుతం సోషల్‌ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఏ సమాచారం అయినా క్షణాల్లో వైరల్‌ అవుతోందని క‌మిష‌న‌ర్‌ శ్వేత అన్నారు. అయితే వైరల్‌ అవుతున్న ప్రతి సమాచారం వాస్తవం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ప్రచురించకూడదన్నారు. వైరల్‌ కావడం వేరు.. వాస్తవం కావడం వేరని అన్నారు. ఎక్కువ వ్యూస్‌, క్లిక్స్‌ కోసం సంచలనాత్మకంగా వార్తలను రూపొందించడం కంటే ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధితుల గళాన్ని వినిపించడం, అవినీతి, అక్రమాలను ఆధారాలతో వెలుగులోకి తీసుకురావడం జర్నలిజం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ శాఖలు లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక సమాచారం తీసుకున్న తర్వాతే ఏదైనా విషయాన్ని నమ్మాలని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు, బాధితులు, మహిళలు, పిల్లల విషయంలో వార్తలు రాసేటప్పుడు మరింత సంయమనం పాటించాలని సూచించారు. బాధితుల కష్టాలను సంచలనంగా మార్చకుండా వారి సమస్యలను సమాజం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా జర్నలిజం ఉండాలని అన్నారు. కార్య‌క్ర‌మంలో టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిర‌ణ్ గౌడ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లెబోయిన నాగ‌రాజు, కోశాధికారి ప‌ల్లె వంశీ, ఉపాధ్యక్షుడు మోహ‌న్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ బూర న‌గేష్ గౌడ్‌, గౌర‌వ అధ్య‌క్షుడు గ‌డ్డం కేశ‌వ‌మూర్తి, ఈసీ మెంబ‌ర్ ర‌వీంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం 50 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.