epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. బీజేపీ కక్షనే

రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. బీజేపీ కక్షనే
కాషాయం పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనం
ఈరోజు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసు
హల్ద్వానీలో దళితులను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. హల్ద్వానీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు గంగాజలంతో శుద్ధి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. దళితుడు కూర్చున్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం గాంధీభవన్‌ నుంచి మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టినట్లు స్వర్ణ తెలిపారు. ర్యాలీగా వెళ్తున్న మహిళా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్‌ ఎదుటే శాంతియుత నిరసన చేపట్టామని చెప్పారు.

కాషాయం పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనం

హల్ద్వానీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ అనంతరం ఆయన కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు గంగాజలంతో శుద్ధి చేశారని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఒక దళితుడు కూర్చుంటే ఆ ప్రదేశం అపవిత్రమవుతుందా? అని ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ హిందుత్వం.. ఇదేనా ఆ పార్టీ సంస్కారం అని నిలదీశారు. ఖర్గేను అవమానించడం మాత్రమే కాదని, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనను తమ నాయకుడు రాహుల్‌గాంధీ ధైర్యంగా ప్రశ్నించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారని తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోకుండా న్యాయం కోసం మాట్లాడిన రాహుల్‌గాంధీపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసు

కులగణన జరగాలని రాహుల్‌గాంధీ అడిగితే కేసు, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరితే కేసు, దేశ సంపదను దోచుకుంటున్న అదానీ గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. దేశ రాజ్యాంగం, ప్రజల ఆత్మగౌరవం కోసం రాహుల్‌గాంధీ భయపడకుండా నిలబడుతున్నందుకే బీజేపీకి ఆయన అంటే భయమని అన్నారు. ఈరోజు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే.. రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతుందని హెచ్చరించారు. ప్రజలు భయపడాలని బీజేపీ భావిస్తోందని, అయితే మహిళా కాంగ్రెస్‌ భయపడబోదని స్పష్టం చేశారు. తాము ఇందిరాగాంధీ వారసులమని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు.

హల్ద్వానీలో దళితులను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి

రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన ఇక్కడితో ఆగదని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన “డరో మత్‌.. భయపడకు” అనే పిలుపుతో ముందుకు సాగుతామని చెప్పారు. రాజ్యాంగం కోసం, దళితుల హక్కుల కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.