epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి..?

కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి..?100 రోజుల్లో చేస్తామన్నారు.. 1000 రోజులైనా అమలు చేయలేదు
కేసీఆర్‌పై నిందలు మాని ప్ర‌జ‌ల‌కిచ్చిన‌ మాట నిలబెట్టుకోండి
హామీలు అమలు చేయకుంటే ప్ర‌జ‌ల‌ తిరుగుబాటు తప్పదు
బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు
ములుగు జిల్లా కేంద్రంలో శ్రేణుల‌తో క‌లిసి భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, అనేక ఉపహామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు హామీల అమలుపై సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి పాలించాలని చూస్తే క్షమించబోమని, హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు శివారులోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతితో కలిసి లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీల అమలుపై ఆయన నిలదీశారు.

మహాలక్ష్మి హామీ ఏమైంది..?

మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని లక్ష్మీనరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు ఆ మొత్తం అందుతోందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటలను మరిచిపోయిందని విమర్శించారు. రైతులకు రైతుబంధు స్థానంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, వానాకాలం, యాసంగి సీజన్లు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో ఆ సాయం పూర్తిస్థాయిలో పడటం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి రూ.4 వేల హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

కేసీఆర్‌పై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు

పాలన చేతకాక ప్రతి వైఫల్యానికి కేసీఆర్‌ను నిందించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని లక్ష్మీనరసింహారావు విమర్శించారు. కాళేశ్వరం కూలిందని, అప్పులు పెరిగాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతూ గత ప్రభుత్వంపై బురదజల్లడమే తప్ప.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో కాంగ్రెస్‌ చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్లకు చేరువైన పాలనలో సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క విజయం లేకపోవడంతోనే కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రజలు కాంగ్రెస్‌ మాటలను నమ్మబోరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజీతో ములుగు ప్రాంతంలోని చెరువులు నిండాయని, మిషన్‌ భగీరథ ద్వారా గిరిజన గూడేల్లోకి నల్లా నీరు వచ్చిందని గుర్తుచేశారు. రైతుబంధు పథకం రైతులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ప్రతి గడ్డపై గులాబీ తిరుగుబాటు

ములుగు గడ్డపై ప్రారంభమైన గులాబీ పోరాటం ఇక్కడితో ఆగదని లక్ష్మీనరసింహారావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులోనే ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తెలంగాణలోని ప్రతి గడ్డపై, ప్రతి గ్రామంలో గులాబీ తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. హామీలతో గెలిచి.. మోసంతో పాలించాలని చూస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ములుగు గడ్డపై ఎగిసిన గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవ పునరుద్ధరణకు నాంది అని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.