epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!
రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం
చైర్ పర్సన్ ఆదేశాలకు వ్యాపారుల‌ మంగళం
ఫోన్ కాల్ తో ఆగిపోయిన తొలగింపు
నాయకుల గుప్పిట్లో మార్కెట్!
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం కట్టిన మోడల్ మార్కెట్.. నేడు కొందరి జేబులు నింపే బోడి మార్కెట్ గా మారింది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక హంగులతో 91 కమిషన్ షాపులు, 30 కమర్షియల్ షట్టర్లు, 158 మడిగలు, విశాలమైన పార్కింగ్ తో నిర్మించిన లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా అక్రమార్కుల చేతిలో చిక్కుకుంది. మొదటి దోపిడీ పార్కింగ్ స్థలంలోనే మొదలైంది. వాహనాల కోసం కేటాయించిన విలువైన స్థలాన్ని అధికారుల అండదండలతో ఓపెన్ ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లను ఎవరో బయటి వారు కాదు.. ఇదే మార్కెట్ లోని కమిషన్ వ్యాపారులే కొట్టేసినట్లు బహిరంగ రహస్యం. ఇది చాలదన్నట్లు తమ షాపుల ముందున్న ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించి నెలకు వేలల్లో కిరాయిలకు ఇస్తూ దందా చేస్తున్నారు. అధికారులు కళ్లుండి చూడలేని గుడ్డివాళ్లయ్యారా? అన్నది ప్రజల ప్రశ్న.
రోడ్డే దుకాణం.. రోడ్డే గోడౌన్! రోడ్లకు ఇరువైపులా తడకలు
                   పార్కింగ్ స్థలంలో అమ్మకాలు
రోడ్డే దుకాణం.. రోడ్డే గోడౌన్!
అసలు నరకం మార్కెట్ బయట. రోడ్లకు ఇరువైపులా ఇష్టానుసారంగా తడకలు, టెంట్లు నాటేసి రోడ్డునే దుకాణంగా మార్చేశారు. రోడ్డు మీదనే లారీలు, ఆటోలు నిలిపేసి సరుకు దించుతున్నారు. దీంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ జామ్. కూరగాయలు కొనడానికి వచ్చే మహిళలు, వృద్ధులు, వాహనదారులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లలేని దుస్థితి.
ఈ దుస్థితి సామాన్యుడికే కాదు.. సాక్షాత్తు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ యెర్ర ప్రియాంక, డీఎంఓ నాగరాజు, డీడీఎం పద్మావతి లకే ఎదురైంది. ఇటీవల చైర్ పర్సన్ యెర్ర ప్రియాంక అనిల్ వాహనం కూడా ఈ తడకల జామ్ లో చిక్కుకుంది. దీంతో ఆగ్రహించిన చైర్ పర్సన్ వెంటనే రోడ్లపై తడకలు తొలగించాలని అధికారులపై మండిపడ్డారు. చైర్ పర్సన్ ఆదేశంతో అధికారులు హడావుడిగా తడకల తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. వ్యాపారులకు ఫోన్లు చేసి తొలగించుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్. మార్కెట్ లోకి రాజకీయం ఎంటర్ అయింది. కొందరు స్థానిక నాయకుల నుండి అధికారులకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. “అప్పుడే తొలగిస్తే వాళ్లు ఎక్కడ బతకాలి? పండగ వరకు ఆగండి” అంటూ ఒత్తిడి. దీంతో తొలగింపు కార్యక్రమానికి బ్రేక్ పడింది.
లైసెన్స్ లేకుండా వ్యాపారం.. ఎవరి అండ?
అక్రమార్కులు చైర్ పర్సన్ ను కలిసి వినాయక చవితి పండగ వరకు గడువు ఇవ్వాలని బతిమిలాడినట్లు సమాచారం. అసలు షాకింగ్ విషయం ఏంటంటే.. రోడ్లపై తడకలు వేసి వ్యాపారం చేస్తున్న వారిలో కొంత మందికి మార్కెట్ లో లైసెన్స్ లేనే లేదు. లైసెన్స్ లేని వారికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారు? దీని వెనుక నెలవారీ మామూళ్ల దందా నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎందరో డీఎంఓలు, సెక్రటరీలు మారారు కానీ మార్కెట్ లో వ్యాపారుల పెత్తనం మాత్రం మారలేదు. ఏ అధికారి నిజాయితీగా పనిచేద్దామన్నా రాజకీయ నాయకుల అండ చూసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన నాయకులే అక్రమార్కులకు కొమ్ముకాయడం దారుణమని రైతులు, కొనుగోలుదారులు మండిపడుతున్నారు. రాజకీయ జోక్యం లేకుండా మార్కెట్ బైలా ప్రకారం పాలన సాగితేనే లక్ష్మీపురం మార్కెట్ బాగుపడుతుందని, లేకుంటే మోడల్ మార్కెట్ పేరుతో ప్రజాధనం వృధా అయినట్లేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ తర్వాత నోటీసులు ఇచ్చి తొలగిస్తామని అధికారులు చెబుతున్నా.. ఆ నోటీసులు కూడా నాయకుల ఫోన్ కాల్స్ తో తుంగలో తొక్కుతాయా? లేక చట్టం తన పని తాను చేస్తుందా? అనేది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.