epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సాయి వర్షిణికి సీపీ శ్వేత‌ అభినందనలు

సాయి వర్షిణికి సీపీ శ్వేత‌ అభినందనలు
సాఫ్ట్‌బాల్ అండర్‌-15 ఆసియా కప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం

కాకతీయ, హనుమకొండ : భారత సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ఎంపికైన హనుమకొండకు చెందిన క్రీడాకారిణి వెల్పుల సాయి వర్షిణిని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిల్లి సాంబశివరావు ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ తాబేటి రాజేందర్‌, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్‌ పోలేపాక వినయ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీని కలిశారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ భారత జట్టుకు సాయి వర్షిణి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారిణిగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమన్నారు. హనుమకొండకు చెందిన అనిల్‌, సుజాత దంపతుల కుమార్తె సాయి వర్షిణి గ్రీన్‌వుడ్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. చైనాలోని వుక్సీ నగరంలో అక్టోబర్‌ 12 నుంచి 18 వరకు జరగనున్న 5వ అండర్‌-15 ఉమెన్స్‌ సాఫ్ట్‌బాల్‌ ఆసియా కప్‌-2026లో సాయి వర్షిణి పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాయి వర్షిణి తండ్రి అనిల్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు, కోచ్‌ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం మామిడిగూడెం,...

రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం

రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం రోడ్డును క‌బ్జా చేస్తూ క‌న్‌స్ట్రక్ష‌న్‌ అక్రమ నిర్మాణంపై చూసి చూడ‌న‌ట్లుగా...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో నిమజ్జన ఏర్పాట్లపై సీపీ, కమిషనర్ ప్రత్యేక...

నిండు కుండలా చెరువులు

నిండు కుండలా చెరువులు పరవళ్లు తొక్కుతున్న మత్తళ్లు కాకతీయ, పెద్దవంగర : ఎడ‌తెర‌పి లేకుండా...

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన కాకతీయ,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లోని బాలికల గురుకుల...

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం బడి తండా సర్పంచి ధనమ్మ అమ్రూ నాయక్ కాకతీయ,నెల్లికుదురు...

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు 27 నుంచి స్వామివారి మండల దీక్షలు...

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.