epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?
ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన
పెండింగ్‌ డీఏలు వెంటనే విడుదల చేయాలి
పీఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలి
సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలి
ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి

కాక‌తీయ‌, హైదరాబాద్ : ఉద్యోగులను బాధ్యులను చేసి ప్రజల్లో దోషులుగా చూపేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల హక్కులపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కమిటీల పేరుతో సమస్యలను వాయిదా వేస్తోందని అన్నారు. పెండింగ్‌ డీఏలు విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డీఏలు చెల్లించాల్సింది, పీఆర్సీ అమలు చేయాల్సింది ప్రభుత్వమేనని రాకేష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ఉద్యోగులు తమ హక్కులు అడిగితే వారినే తప్పుపట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్‌, ప్రమోషన్ల హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. డీఏల పెండింగ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, పీఆర్సీ అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ సమస్య పరిష్కారానికి మళ్లీ కమిటీ ఏర్పాటు చేయడం కాలయాపనకే దారితీస్తుందని రాకేష్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలు సమస్యలను ప్రస్తావిస్తే కమిటీలు వేయడం కాకుండా కాలపరిమితితో పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని కోరారు.

ఈహెచ్‌ఎస్‌పై స్పష్టత ఇవ్వాలి

ఉద్యోగుల వేతనాల నుంచి ఈహెచ్‌ఎస్‌ కోసం మొత్తాలు కట్‌ చేస్తున్నప్పటికీ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని రాకేష్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల నుంచి ఇప్పటివరకు కట్‌ చేసిన మొత్తాల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్‌, గ్రాట్యుటీ, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, హోంగార్డులు, 104, 108 సిబ్బంది, ఆర్పీలు, వీవోఏల సమస్యలను పరిష్కరించాలని రాకేష్‌రెడ్డి కోరారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్‌, ఈహెచ్‌ఎస్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు, చిరు ఉద్యోగుల వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన టైమ్‌లైన్‌ ప్రకటించాలని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకులు కాదని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమని రాకేష్‌రెడ్డి అన్నారు. వారి సమస్యలను కమిటీలతో, వాయిదాలతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల తరఫున బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి...

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత కరెంటు కోతలపై సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌...

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.