ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
భూమి, భుక్తి కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
మహిళలు ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ పిలుపు
కాకతీయ, నర్సంపేట టౌన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం నర్సంపేటలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజల తెగువకు, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, తక్కలపెల్లి రవీందర్‌రావు, మచ్చిక నరసయ్య, జిల్లా నాయకురాలు దార్ల రమాదేవి, జిల్లా నాయకులు గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.

