epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

100 శాతం పంటను కొనాలి

100 శాతం పంటను కొనాలి
మద్దతు ధర ప్రకట‌న‌తో బాధ్య‌త పూర్తిన‌ట్లు కాదు
వర్షాభావ ప్రాంతాలను గుర్తించాలి
కరువు మండలాలపై ప్ర‌ణాళిక‌లు, ప్రతిపాదనలు రూపొందించాలి
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా కరువు అంచనా వేయాలి
ఎల్‌నినో పరిస్థితుల్లో రైతుకు మద్దతు ధర దక్కాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు మండలాల ప్రతిపాదనలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనతో పంట నష్టాన్ని నిర్ధారించాలని సూచించారు. కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కేవలం వర్షపాతం లోటును మాత్రమే కాకుండా వర్షపాతం వ్యత్యాసం, ఎస్‌పీఐ, పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, ఎన్‌డీవీఐ/ఎన్‌డీడబ్ల్యూఐ, వీసీఐ, నేల తేమ, రిజర్వాయర్‌ నిల్వలు, భూగర్భజల పరిస్థితులు, ప్రవాహ జలాలు, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి, వలసలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి తెలిపారు.

లోటు వర్షపాతాన్ని గుర్తించాలి

సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం లోటును లోటు వర్షపాతంగా, 60 నుంచి 99 శాతం లోటును భారీ లోటుగా, వర్షం పూర్తిగా లేకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయని తుమ్మల తెలిపారు. సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 85 శాతం కంటే తక్కువగా ఉంటే కరువు పరిస్థితికి, 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే తీవ్రమైన కరువుకు సూచికగా పరిగణించాలని చెప్పారు. మద్దతు ధర ప్రకటించడంతో కేంద్రం బాధ్యత పూర్తికాదని, ఆ ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని తుమ్మల అన్నారు. రబీ మార్కెటింగ్‌ సీజన్‌ 2027–28కు సంబంధించి కుసుమకు క్వింటాల్‌కు రూ.675, రేప్‌సీడ్‌–ఆవాలకు రూ.413, మసూర్‌కు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ధరల మద్దతు పథకం కింద పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్‌ ద్వారా 25 శాతం మాత్రమే సేకరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎల్‌నినో, వాతావరణ మార్పుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రం 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ప్రకటించిన మద్దతు ధరకు 100 శాతం పంటల సేకరణ జరిగినప్పుడే రైతులకు పూర్తి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, మార్కెటింగ్‌ ఎండీ రాహుల్‌ రాజ్‌, ఉద్యానవన శాఖ ఎండీ యాస్మిన్‌ బాషా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు డీడీ కట్టినా లోడింగ్‌ పేరుతో అదనపు బాదుడు దొడ్డు...

ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు...

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు...

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌ నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం...

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.